NTV Telugu Site icon

Tragedy: బట్టలు ఉతుకుతూ నీటి గుంటలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

Tragedy

Tragedy

Tragedy: ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలలో ఉన్న నీటిగుంటలో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లని తెలిసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు పొట్టకూటి కోసం దొనబండ గ్రామానికి వచ్చారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆ గ్రామంలోని క్వారీ గుంటలో ఉన్న నీటిలో బట్టలు ఉతుక్కునేందుకు వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా ఓ మహిళ కాలుజారి నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు మరో మహిళ కూడా నీటిలో దూకింది. ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు.

Read Also: Madhyapradesh : ముందు గుడికి దండంపెట్టాడు.. తర్వాత బాంబులు వేశాడు

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీటి కుంటలో ఉన్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళల మృతితో వారి కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు మహిళల మృతిని చూసి గ్రామస్థులు కంటనీరు పెట్టుకున్నారు.