Site icon NTV Telugu

Two Sisters Suicide: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన వెనుక గుండెల్ని పిండేసే విషయాలు..!

Crime

Crime

Two Sisters Suicide: రాయచోటిలో జరిగిన ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. కన్నతండ్రే బిడ్డల జీవితాలు నాశనమయ్యేందుకు కారణమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకెళ్లాడా దుర్మార్గుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటికి చెందిన హుస్సేన్ దినసరి కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ, ఏదో ఒక సాకు చెబుతూ తండ్రి వాటిని చెడగొడుతూ వస్తున్నాడు. ఆలస్యంగా ఈ విషయం కూతుళ్లకు తెలిసింది. కన్నవాళ్లకు భారం కావడం ఎందుకు అనుకున్నారో ఏమో..! ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకరిపై మరొకరు కిరోసన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అక్క ఫాతిమా మధ్యలోనే చనిపోగా.. చెల్లెలు అఫ్రీన్‌ ట్రీట్మెంట్‌ తీసుకుంటూ ప్రాణాలు విడిచింది.

Read Also: Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
అయితే, ఆఖరి నిమిషంలో అక్కా చెల్లెళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు…. కేసు నమోదు చేశారు. బిడ్డల బతుకు కోరాల్సిన తండ్రి… పెళ్లిళ్లు కాకుండా అడ్డుపడి వారి మరణానికి కారణమయ్యాడు. దీనంతటికీ పేదరికం మరో కారణమైనా.. సమస్యలకు సవాలక్ష పరిష్కార మార్గాలుంటాయన్న సంగతి మరిచిపోయాడు. కూతుళ్లనే పోగొట్టుకున్న నాన్న.. చివరకు ఏంసాధించాడు? ఇకపై ఏం సాధిస్తాడు? ఏం సాధించగలడు? సమాజం ముందు మనస్సాక్షి ముందు దోషిగా తలవంచుకోవడం తప్ప..! మొత్తంగా ఓవైపు పేదరికం.. మరోవైపు కన్నతండ్రి శాడిజం..! అయినా ఆత్మస్థైర్యంతో పరిస్థితుల్ని ఎదుర్కొంటే జీవితం మరోలా ఉండేంది. కానీ, కుంగిపోయి అక్కాచెల్లెళ్లు తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.

 

Exit mobile version