Two Ships Sink : ఘోర ప్రమాదం.. రెండు నౌకలు మునిగి 11 మంది మృతి, 64 మంది గల్లంతు
- ఇటలీ తీరంతో మునిగిన రెండు నౌకలు
- ప్రమాదంలో 11 మంది మృతి 64 మంది గల్లంతు
- 10మృతదేహాలను కనుగొన్న రెస్క్యూ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Ships Sink : ఇటలీలోని దక్షిణ తీరంలో సోమవారం రెండు నౌకలు మునిగిపోవడంతో 64 మంది సముద్రంలో గల్లంతయ్యారు.. 11 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయి. ఇప్పటివరకు 11 మందిని రక్షించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. జర్మన్ సహాయక బృందం రెస్క్యూషిప్ సోమవారం ‘ట్విట్టర్’లో ఒక పోస్ట్‌లో మాట్లాడుతూ.. ఓడ ప్రమాదంలో ఇటలీలోని చిన్న ద్వీపం లాంపెడుసా సమీపంలో 10 మంది మృతదేహాలను రెస్క్యూ కార్మికులు కనుగొన్నట్లు పేర్కొంది.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇటాలియన్ కోస్ట్ గార్డ్ సోమవారం అర్థరాత్రి వరకు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా తీరానికి 120 మైళ్ల (193 కిమీ) దూరంలో చిక్కుకుపోయిన పడవ గురించి సమాచారం అందుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. మర్చంట్ షిప్ 12 మందిని కాపాడింది. నౌక మునిగిపోవడంతో ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ఇటాలియన్ పెట్రోలింగ్ బోట్లు, ATR 42 విమానం ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. సోమవారం సాయంత్రం వరకు మరెవరూ సజీవంగా కనిపించలేదు. ఇరాక్, సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలసదారులు, శరణార్థులను తీసుకువెళుతున్న పడవ గత వారం టర్కీ నుండి బయలుదేరిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
Read Also:PGCIL Recruitment 2024 : పవర్ గ్రిడ్ లో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
ఇంతకుముందు జరిగిన ప్రమాదంలో జర్మన్ సహాయక బృందం రెస్క్యూషిప్‌తో పాటు రెస్క్యూ టీమ్ 10 మంది వలసదారులను చనిపోయినట్లు కనుగొన్నారు. ఇటలీ దక్షిణ ద్వీపం లాంపెడుసా నుండి మాల్టా సమీపంలో ఒక పడవలో ఉన్న మరో 51 మందిని రక్షించగలిగారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈజిప్ట్, సిరియా నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యధరా సముద్రంలో పడవలో ప్రయాణించే వలసదారులు వాతావరణ ప్రభావం, నాణ్యత లేని నౌకల కారణంగా ఇటువంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు సముద్రం దాటుతున్నప్పుడు దాదాపు వెయ్యి మంది మరణించారు. గతేడాది 2023లో 3155 మంది అదృశ్యమయ్యారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!