NTV Telugu Site icon

Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

Kejrival

Kejrival

దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. పాఠశాలల్లో ఈ సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలు జూలై 17 మరియు 18 తేదీలలో మూసివేయనున్నట్లు.. ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు, ఈశాన్య, సౌత్ ఈస్ట్, నార్త్, నార్త్ వెస్ట్ మరియు సెంట్రల్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు DOE (నార్త్ వెస్ట్-బి, వెస్ట్-ఎ, వెస్ట్-బి, సౌత్, సౌత్ వెస్ట్-ఎ, సౌత్ వెస్ట్-బి మరియు న్యూ ఢిల్లీ) మిగిలిన అన్ని పాఠశాలలు (ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన మరియు ప్రైవేట్ గుర్తింపు పొందినవి) సోమవారం యథావిధిగా ఓపెన్ కానున్నాయి.

Pawan Kalyan: రేపు తిరుపతికి పవన్.. అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు

జూలై 13నుంచి యమునా నది నీటిమట్టం పెరుగుతూనే ఉన్నందున.. జూలై 16 వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనవసర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీలోని రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఇళ్లు కూలిపోవడం మరియు ట్రాఫిక్ జామ్‌లు వంటివి చాలా జరుగుతున్నాయి.

Viral Video: ప్రవహిస్తున్న వరదలో కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్..!

అంతేకాకుండా.. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. యమునా నది ఒడ్డున నివసిస్తున్న పేద కుటుంబాలు వరదల్లో తమ ఇళ్లు కోల్పోయాయని కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువులన్నీ పోగొట్టుకున్నారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పడుతోందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కేజ్రీవాల్ అన్నారు.