Site icon NTV Telugu

Kamareddy: బీబీపేట పెద్ద చెరువుకు బుంగ.. విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు

Roads

Roads

కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ.

Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 135 శాతం అధికంగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాజం పేట, భిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగం పేట, కామారెడ్డి, భిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ, నిజాం సాగర్, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివ నగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, మహమ్మద్ నగర్, గాంధారి లో రెండు రోజుల్లో 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Also Read:Off The Record : కాళేశ్వరం నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుంది?

వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు.. జిల్లా వ్యాప్తంగా తెగిన 55 చెరువులు.. 380 గ్రామాల్లో 93, 925 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా.. వరి, పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం.. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో ఇద్దరు మృతి , మరొకరు గల్లంతు.. 18 గేదెలు, 8ఆవులు, 10వేల కోళ్లు మృత్యువాత.. కూలిన 13ఇళ్లు, పాక్షికంగా దెబ్బ తిన్న 310 ఇళ్లు.. 24 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు, 34 అర్.అండ్.బి. రోడ్లు ధ్వంసం అయినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version