Indigo Flight : రోడ్లపై అయిపోయాయి.. ఇక విమానాల్లో మొదలయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Flight : ఇప్పటి వరకు రోడ్లపై వెళ్తున్న మహిళలపై మందుబాబులు వేధింపులకు పాల్పడే వారు. ఇక వారి వేధింపులు విమానాల్లో మొదలుపెట్టారు. ఎయిర్‌ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటిదే మరొకటి జరిగింది. ఇండిగో విమానంలో ప్రయాణికులు తప్పతాగి రచ్చ రచ్చ చేశారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు.
Read Also: Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. పీకల దాకా తాగిన ముగ్గురు వ్యక్తులు విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు. దీంతో వీరి గురించి విమాన సిబ్బంది ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్‌ఎఫ్ అధికారులు వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.
Read Also: Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత
ఇదిలా ఉండగా.. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ప్రయాణికురాలిపై తాగిన మత్తులో ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. ఈ ఘటన తనకు, తన సహోద్యోగులకు వ్యక్తిగతంగా తీవ్ర వేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై తాము మరింత వేగంగా స్పందించి ఉంటే బాగుండేదని, కానీ తాము తగిన రీతిలో స్పందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఆమె తాజాగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!