Bangladesh Crisis : మీకు తెలుసా.. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని, దేశ జెండాను రూపొందించింది హిందువులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్ జాతీయ గీతం బెంగాలీ, సంస్కృతం భాషల మిశ్రమంగా రూపొంచించబడింది. ఇది 1972 నుండి ‘అమర్ సోనార్ బంగ్లా…’ దేశ గీతంగా అమల్లోకి వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ చిన్నారి పాడింది. ఇది ఒక భారతీయుడు వ్రాసాడని.. అతను హిందూ మతానికి చెందినవాడు. అతని సాహిత్యం మొత్తం బెంగాల్‌ను ఆకర్షించింది. అదేవిధంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎప్పుడు తయారు చేశారు అనే కథ కూడా ఆసక్తికరంగా ఉంది. దీనిని ఢాకాలో నివసిస్తున్న ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన దుస్తులతో తయారు చేయబడింది. ఢాకాలో నివసిస్తున్న ఒక హిందూ డిజైనర్ దీన్ని తయారు చేశారు.
ముందుగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం. ఆ వ్యక్తి బంగ్లాదేశ్ డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ శిబ్ నారాయణ్ దాస్. అతను విద్యార్థి నాయకుడు. తరువాత డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ అయ్యాడు. బంగ్లాదేశ్ జెండా, ఆకుపచ్చ చతురస్రం లోపల పెద్ద ఎర్రటి వృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది అతనే రూపొందించాడు. శివనారాయణ్ దాస్ ఢాకాకు చెందిన వ్యక్తి. తర్వాత ఈ జెండాలో కొన్ని మార్పులు చేశారు. అతను 1972లో ఈ జెండాను తయారు చేసినప్పుడు, ఈ ఎర్రటి వృత్తంలో బంగ్లాదేశ్ పసుపు రంగు మ్యాప్ కూడా ఉంది, తరువాత దానిని తొలగించారు. ఎందుకంటే జెండాకు రెండు వైపులా ఒకే విధంగా కనిపించేలా చేయడం చాలా కష్టమైన పని. నారాయణ్ దాస్ 77 సంవత్సరాల వయస్సులో ఢాకాలో ఏప్రిల్ 19న మరణించారు.
Also Read
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
Read Also:IT Minister Sridhar Babu: ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా హైదరాబాద్..
ఈ జెండా ఏం చెబుతోంది?
జెండాలో ఉన్న ఆకుపచ్చ నేపథ్యం బంగ్లాదేశ్ పచ్చని వ్యవసాయాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న ఎరుపు వృత్తం స్వాతంత్ర్య పోరాటంలో బంగ్లాదేశీయులు చిందిన రక్తాన్ని సూచిస్తుంది.
జాతీయ గీతాన్ని ఎవరు రాశారు
ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారో చూద్దాం. దీనిని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఇది బెంగాలీ భాషలో ఉంది. 1906లో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు బెంగాల్‌ను మత ప్రాతిపదికన రెండు భాగాలుగా విభజించినప్పుడు ఆయన దీనిని రాశారు. ఈ పాట బెంగాల్ సమైక్యత కోసం ఒక వాతావరణాన్ని సృష్టించడానికి వ్రాయబడింది. 1972లో బంగ్లాదేశ్ స్వతంత్రం అయినప్పుడు, ఈ పాటలోని మొదటి పది లైన్లను జాతీయ గీతంగా అంగీకరించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం రెండు దేశాల జాతీయ గీతంగా మారింది. ప్రపంచంలోనే రెండు దేశాలకు జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రచించిన జన-గణ మన, భారత రాజ్యాంగ సభ 24 జనవరి 1950న అధికారికంగా భారత జాతీయ గీతంగా ఆమోదించబడింది. 22 సంవత్సరాల తరువాత, జనవరి 13, 1972 తర్వాత ఆయన రాసిన “అమర్ సోనార్ బంగ్లా” అధికారికంగా బంగ్లాదేశ్ జాతీయ గీతంగా గుర్తించబడింది.
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!