NTV Telugu Site icon

Helicopters Collided: టేకాఫ్ సమయంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆస్ట్రేలియాలో ఘటన

Australia

Australia

పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: LIC: ఎల్ఐసీ పాలసీని మధ్యలో ఆపేశారా..ఇలా చేస్తే నగదు వాపస్

ఒక వార్తా సంస్థ ప్రకారం.. కింబర్లీ ప్రాంతంలోని చిన్న పట్టణమైన క్యాంబ్లిన్‌లోని మౌంట్ అండర్సన్ స్టేషన్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయని పశ్చిమ ఆస్ట్రేలియా పోలీస్ ఫోర్స్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 6:20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఈ సమయంలో హెలికాప్టర్‌లో ఒక పైలట్ మాత్రమే ఉన్నట్లు భావిస్తున్నారు.

Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “రెండు హెలికాప్టర్లు టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఢీకొన్నాయని ప్రాథమిక సూచనలు సూచిస్తున్నాయి. రెండు హెలికాప్టర్లలో ఒక్కో పైలట్ మాత్రమే ఉన్నట్లు భావిస్తున్నారు.” విమానంలో ప్రయాణిస్తున్న వారి వివరాలు, వారి గాయాల తీవ్రత ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.