సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం.. యువత ఎంతటికైనా తెగిస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఓ ప్రేమజంట కదులుతున్న బైక్ పైనే బహిరంగంగా రొమాన్స్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఓ వీడియోలో బైక్ పై ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలించుకున్నారు. కానీ వారు ప్రేమజంట కాదు.. ఇద్దరు అమ్మాయిలే. అయితే వారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో.. ఇద్దరు అమ్మాయిలు కదులుతున్న బైక్‌పై ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మరియు కౌగిలించుకోవడం చూడవచ్చు. వారిద్దరు బైక్‌పై కూర్చున్న తీరు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వీడియోలో జరిగిన సంఘటన ఎక్కడిది అనేది తెలియరాలేదు. కానీ బైక్ నంబర్ ప్లేట్ చూస్తే మాత్రం తమిళనాడులో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రోడ్డుపై బైక్ అతి వేగంతో వెళ్తుండటం వీడియోలో చూడొచ్చు. బైక్ పై రైడ్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. అంతేకాకుండా బహిరంగంగా ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న మరో బైకర్ వారి సన్నివేశాన్ని తన మొబైల్ లో రికార్డ్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.
Paneer Side Effects : టేస్ట్ బాగుంది కదా అని కుమ్మేస్తున్నారా? ఇది మీకోసమే..
ఇన్‌స్టాగ్రామ్‌లో @ghantaa అనే పేజీలో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 26 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 80 వేల మంది లైక్ చేశారు. ఇద్దరు అమ్మాయిల రొమాన్స్‌కి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే నెటిజన్లు చూడటానికి ఎగబడ్డారు. అంతేకాకుండా ఈ వీడియోపై జనాలు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటా పిచ్చి పని.. అంత ముద్దులు పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి గానీ.. ఇలా రోడ్ల మీద బహిరంగంగా పెట్టుకోవడమేంటని కామెంట్స్ చేస్తున్నారు.