Site icon NTV Telugu

Tragedy: తీవ్ర విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మత్స్యకారులు మృతి

Electric Shock

Electric Shock

Tragedy: పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మొగల్తూరు మండలం మొళ్లపర్రు గ్రామంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చేపల వేటకు వెళ్తున్న సమయంలో చెరువు వద్ద వేసిన ఫెన్సింగ్‌కు కరెంట్ సప్లయ్ అయిన విషయాన్ని గుర్తించలేకపోయిన ఇద్దరు మత్స్య కారులు ఫెన్సింగ్ తీగలను పట్టుకుని కరెంటు షాక్‌కు గురయ్యారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: Roller Coaster: పాడై పోయిన రోలర్ కోస్టర్.. మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడారు

మృతులు తిరుమాని నారాయణమూర్తి(59), బంధన వేంకటేశ్వరులు(56) గా గుర్తించారు. ఉదయం నుంచి వర్షం కలవడంతో చేపల చెరువుకు వేసిన బోరు ద్వారా ఫెన్సింగుకు కరెంటు పాస్ అయినట్టుగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version