Somalia Explosions: సోమాలియాలో వరుస బాంబు పేలుళ్లు.. కంపించిపోయిన రాజధాని మొగడిష్ నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somalia Explosions: భారీ పేలుళ్లతో సోమాలియా దేశం దద్దరిల్లిపోయింది. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. మరోవైపు ఆ దేశ రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందినట్లు చెందినట్లు సమాచారం.
సోమాలియా కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం సంభవించిన రెండు పేలుళ్లతో సోమాలియా రాజధాని మొగడిషు నగరం కంపించిపోయింది. రెండు వరుస పేలుళ్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రెండు కార్లలో బాంబుల పేలుడు ధాటికి పదుల సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రద్దీగా ఉండే జంక్షన్లో నిమిషాల గ్యాప్‌లో బాంబు పేలుళ్లు జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి వందల మీటర్ల ఎత్తులోకి దట్టమైన పొగలు విస్తరించాయి. కిలోమీటర్లమేర పరుచుకున్న పొగతో స్థానికులు ఊపిరిపీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. తొలుత ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర జరిగిన పేలుడులో ఓ అంబులెన్స్ ధ్వంసం కాగా.. రద్దీగా ఉండే ఓ రెస్టారెంట్ సమీపంలో మరో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాద ప్రాంతంలో సహాయకచర్యలు ముమ్మరం చేశామన్నారు.
Also Read
Read Also: Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?
పేలుళ్లు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ పేలుళ్లలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రకటన జారీ చేయలేదు. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ జరుపుతున్న హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సమావేశమైన రోజునే.. ఈ పేలుల్లు జరుగడం విశేషం.
అల్ షబాబ్ తరచుగా హై-ప్రొఫైల్ ప్రదేశాలపై దాడులు చేస్తున్నది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈసారి పేలుళ్లకు కుట్రపన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2015 లో విద్యాశాఖపై ఒకసారి దాడి జరిగింది. జోబ్ జంక్షన్ వద్ద 2017 లో 500 మందికి పైగా మరణించిన పేలుళ్లకు అల్-షబాబ్ కారణమని తేలింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు