Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు ఓ అమ్మాయి కారణంగా చాలా బాధపడ్డాడట.. తను చేసిన పని తెలిసి ఆ అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడట. తను కనపడితే చెప్పమంటున్నాడు.. తన అంతు చూడాలని ఉందని ఆగ్రహంగా ఉన్నాడు. ఇంతకు ఆ అమ్మాయి ఏం చేసిందో రాజ్ తరుణే వివరించాలి.
ఈ కుర్ర హీరో.. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక సుకుమార్ శిష్యుడు సూర్య తెరకెక్కించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ మధ్య రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈసెంట్ గా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Also Read
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
Read Also: Ysrcp Sketch For Pawankalyan Live: పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ స్కెచ్
రాజ్ తరుణ్ రీసెంట్‌గా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘హలో అండీ.. నేను సడెన్‌గా ఈ వీడియో పెట్టడానికో కారణం ఉంది.. మీకొక అమ్మాయి గురించి చెప్పాలి.. నా జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలా.. నాకు చిన్నప్పటినుండి అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం.. అర్థమైపోయింది.. మన జీవితంలో లవ్వూ, గివ్యూ సెట్ కావని.. సిన్సియర్‌గా వెళ్లి నాకు పెళ్లి చేయ్యండని మా అమ్మా, నాన్నని అడిగా.. మొదట కంగారుపడ్డా.. తర్వాత నా కరువు అర్థం చేసుకుని ఓ మంచి సంబంధం చూశారు.
Read Also: Twitter: ట్విటర్ జర్నీ.. మస్క్‌కి ముందు, ఆ తర్వాత!
ఇంకేముంది.. పెళ్లి సెట్, మండపం సెట్టు, రాబందులు, అదే చుట్టాలొచ్చారు.. పండక్కి తయారు చేసిన గంగిరెద్దులా రెడీ చేసి కూర్చోబెట్టారు. మండపానికి తీసుకెళ్లి, పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.. పంతులు, పెళ్లి కూతుర్ని తీసుకురామ్మా.. అన్నాడు.. వాళ్ల చెల్లి వెళ్లి ఓ ఉత్తరం పట్టుకొచ్చింది.. ఛీ, ఛీ.. నా నోటితో నేను చెప్పలేను.. మీకర్థమై ఉంటుంది కదా.. మొగుడు పోయి ఏడుస్తుంటే సామెతలా ఈ చుట్టాలంతా వచ్చి ఎధవ ఎటకారాలు.. చచ్చిన పాముని ఇంకా ఎంత సేపు చంపుతారు.. వాళ్లని కాదు.. దాన్ననాలి.. ఒసేయ్, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా.. మీ అందరూ కూడా కనబడితే నాకు చెప్పండి.. ప్లీజ్.. థ్యాంక్యూ వెరీమచ్’’ అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!