Site icon NTV Telugu

Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!

Kiran Abbavaram

Kiran Abbavaram

రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఏడాదికి రెండు మూడు సినిమాలు చొప్పున రిలీజ్ చేసినా అవేవి ఆశించనంత విజయాన్ని ఇవ్వలేదు. యూవీ క్రియేషన్స్ లో వచ్చిన ‘వినరో భాగ్యం విషు కథ’ ఓ మాదిరి విజయాన్ని నమోదు చేసి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. కానీ SR కల్యాణమండపం అంతటి సక్సెస్ దక్కలేదు . బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ తో కొంత విరామం ప్రకటించి కొత్త కథలు వినడంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు అబ్బవరం. మరోవైపు రియల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ కొట్టాడు కిరణ్. తన మొదటి చిత్రంలో కథానాయికగ నటించిన రహస్య గోరక్‌ తో ప్రేమాయణంలో హిట్ కొట్టాడు కుర్రహీరో. ఇటీవల వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

Also Read: Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!

కాస్త విరామం తర్వాత నేడు తన నూతన చిత్రాన్ని ప్రారంభించాడు కిరణ్ అబ్బవరం. తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్క్కనుంది ఈ చిత్రం. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇద్దరు దర్శకులు డైరక్ట్ చేయబోతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్‌ పర్యవేక్షిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్ముతున్నాడు ఈ హీరో. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘క’ అనే టైటిల్ పరిశీలిస్తోంది యూనిట్.

Exit mobile version