Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!
- కిరణ్ అబ్బవరం నూతన చిత్రం ప్రకటన
- సుజీత్-సందీప్ దర్శకులు
- కాబోయే శ్రీమతి పర్యవేక్షణలో చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో.
ఏడాదికి రెండు మూడు సినిమాలు చొప్పున రిలీజ్ చేసినా అవేవి ఆశించనంత విజయాన్ని ఇవ్వలేదు. యూవీ క్రియేషన్స్ లో వచ్చిన ‘వినరో భాగ్యం విషు కథ’ ఓ మాదిరి విజయాన్ని నమోదు చేసి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. కానీ SR కల్యాణమండపం అంతటి సక్సెస్ దక్కలేదు . బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ తో కొంత విరామం ప్రకటించి కొత్త కథలు వినడంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు అబ్బవరం. మరోవైపు రియల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ కొట్టాడు కిరణ్. తన మొదటి చిత్రంలో కథానాయికగ నటించిన రహస్య గోరక్ తో ప్రేమాయణంలో హిట్ కొట్టాడు కుర్రహీరో. ఇటీవల వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!
కాస్త విరామం తర్వాత నేడు తన నూతన చిత్రాన్ని ప్రారంభించాడు కిరణ్ అబ్బవరం. తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్క్కనుంది ఈ చిత్రం. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇద్దరు దర్శకులు డైరక్ట్ చేయబోతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్ముతున్నాడు ఈ హీరో. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘క’ అనే టైటిల్ పరిశీలిస్తోంది యూనిట్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..