Training For MLAs And MLCs: రెండు రోజులపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు
- హైదరాబాదు నగరంలోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో
- బుధ, గురు వారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Training For MLAs And MLCs: హైదరాబాదు నగరంలోని డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురు వారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనపరిషత్తు సభ్యులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు పరిశీలించారు. ఈ సందర్బంగా MCHRD స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్, సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లను వివరించారు. శాసన సభ్యులు, శాసన పరిషత్తు సభ్యులు ఈ అవగాహన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని స్పీకర్ ప్రసాద్, చైర్మన్ గుత్తా సూచించారు.
Also Read: Mohan Babu: నిన్ను ఎలా పెంచాను రా మనోజ్.. మోహన్ బాబు సంచలన ఆడియో
Also Read
ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ బహిష్కరించనున్నట్లు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేసారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని, శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ అన్నారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేసారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేందుకు, మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి చేస్తున్నారని ఆయన అన్నారు
తాజావార్తలు
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!