Andhra Pradesh: ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏదైనా ఆపద వచ్చిందంటే సమాచారం అందితే చాలు పోలీసులు వాలిపోతారు.. పది మందిని కాపాడడంలో పోలీసులు డిపార్ట్మెంట్ ముందువరుసలో ఉంటుంది.. కష్టమేదైనా.. నష్టం జరుగుతున్నా.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బరిలో దిగేవాడే పోలీసులు.. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసులు.. నడిరోడ్డుపైకి వచ్చి పబ్లిక్‌గా కొట్టుకోవడం చర్చగా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది..
Read Also: Sobhita Dhulipala :నాగచైతన్య రూమర్స్.. బుజ్జి బంగారం అంటూ శోభిత పోస్ట్..
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ఏపీలో కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ఘర్షణకు దిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్టులో శివ, నారాయణస్వామి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు బాహాబాహీకి దిగారు.. ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇంతకీ ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణకు దారి తీసిన విషయం ఏంటంటే.. ? సాయంత్రం డ్యూటీ షిఫ్ట్ ఆలస్యం అయిందనే విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది.. ఇద్దరూ సహనం కోల్పోయారు.. రోడ్డుపైకి ఎక్కారు.. ప్రజలంతా చూస్తుండగానే నడి రోడ్డుపై కొట్టుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఇక, ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే.. ఎప్పుడు వీడియో చూద్దామా? సోషల్ మీడియాలో పెడదామా? అని చూసే ఈ రోజుల్లో.. ఓ వ్యక్తి కానిస్టేబుళ్ల వ్యవహారాన్ని తన మొబైల్ ఫోన్లో బంధించాడు.. ఆ తర్వాత అది సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!