NTV Telugu Site icon

Viral Video: నడిరోడ్డుపై డేంజర్ స్కేటింగ్ విన్యాసాలు..

Viral Video

Viral Video

Viral Video: నేటి తరం యువత వేరేవారి దృష్టిలో పడేందుకు, సోషల్ మీడియా ద్వారా వైరల్‌గా మారేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారికి లైక్‌ లు, కామెంట్‌ లకు తప్ప ఏదీ వారిని ప్రభావితం చేయదు. కొన్ని వీడియోలలో ప్రమాదకరమైన వీడియోలను షూట్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే వారి ఏకైక లక్ష్యంలా కనిపిస్తున్నాయి. కదులుతున్న రైలు దగ్గర నుంచి వీడియోలు పోస్ట్ చేస్తూ, రైలులోంచి దూకడం, రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇలా అనేకరకాల స్టంట్స్ చేసేవారు రోజురోజుకి ఎక్కువ అవుతున్నారు.

Fastest Charging Battery: టెస్లా కంటే వేగవంతమైన బ్యాటరీ.. పదిన్నర నిమిషాల్లో ఛార్జింగ్‌! 870 కిమీ ప్రయాణం

ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినది. ఢాకాలోని బిజోయ్ సరణి మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదకరంగా వేగంగా వెళ్తున్న ట్రక్కును వెనుకకు ఇద్దరు అబ్బాయిలు స్కేటింగ్ చేస్తున్న వీడియో ఇది. వీడియోలో, ఇద్దరు అబ్బాయిలు ట్రక్కు స్లిప్ స్ట్రీమ్‌ ను ఉపయోగించి కదులుతున్న ట్రక్కు వెనుక స్కేటింగ్ చేయడాన్ని చూడవచ్చు. వీడియో మధ్యలో ఒక బాలుడు ట్రక్కును విడిచిపెట్టి, మార్గమధ్యంలో తన విన్యాసంలో భాగంగా కొనసాగించడానికి కొంచెం దూరం ముందుకు కదులుతాడు. అతను ట్రక్కు వెనుకకి మళ్లీ తిరిగి రావడం, మళ్లీ అదే ప్రదేశానికి తిరిగి రావడం, దానిని పట్టుకుని ముందుకు సాగడం కూడా వీడియోలో కనిపిస్తుంది. రద్దీగా ఉండే రోడ్డుపై వీరు ఈ డేంజర్ పని చేయడం వల్ల.. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని వీడియో చూస్తే అర్థమవుతోంది.

Flight Ticket: త్వరపడండి.. ఆగస్ట్ 15న కేవలం రూ. 1578కే విమాన ప్రయాణం

ఇక ఈ వీడియోను చూసిన అనేకమంది ఆ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు రోడ్డుపై కాకుండా చేయాల్సిన చోట చేస్తే దేశానికీ మంచి పేరు తీసుక రావచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments