Site icon NTV Telugu

Ponguleti Srinivasa Reddy: రెవెన్యూ మంత్రి పేరిట వ‌సూళ్లు.. ఇద్దరు అరెస్టు.. మంత్రి పొంగులేటి హెచ్చరిక

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

ఈజీమనీకి అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడే వారు కొందరైతే.. మరికొందరేమో పొలిటికల్ లీడర్స్ ను అడ్డం పెట్టుకుని సంపాదించాలని చూస్తుంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. ఇదే రీతిలో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ ప‌ర్సనల్ అసిస్టెంట్స్ మంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. చివరికి వీరి బాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప‌ర్సనల్ అసిస్టెంట్ ( పిఎ) ల మ‌ని చెప్పి అమాయ‌కుల‌ను మోస‌గిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బుస్సా వెంక‌ట‌రెడ్డి ( వ‌య‌స్సు 34), మ‌చ్చ సురేష్ ( వ‌య‌స్సు 30) హైద‌రాబాద్ నాగోల్‌లో నివాస‌ముంటున్నారు. వీరు మంత్రిగారి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసుల‌కు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విష‌యాన్ని మంత్రిగారి దృష్టికి వ‌చ్చిన వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన పోలీసులు అక్రమ వ‌సూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక నుంచి త‌న పీఏలమంటూ ఎవ‌రైనా ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం క‌లిగినా స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యం 040-23451072 / 040-23451073 నెంబ‌ర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రజలకు సూచించారు. ఎవ‌రైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగప‌రిస్తే క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవని హెచ్చరించారు.

Exit mobile version