NTV Telugu Site icon

Elon Musk: మస్త్ సమస్యల్లో మస్క్.. ఆఫీసు అద్దె చెల్లించలేదని కేసు

Twitter

Twitter

Elon Musk : ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్‌ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన టైం ఏం బాగోలేదు. అతడి అనాలోచిత నిర్ణయాల వల్ల ఉన్న పేరంతా గంగలో కలిసిపోయింది. ఇటీవల ఆయన ప్రపంచంలోనే ఎక్కువ ధనాన్ని కోల్పోయిన వ్యక్తుల్లో ప్రముఖుడిగా నిలిచారు. ఇప్పటి వరకు తన ఆఫీసు సమస్యలు వేధిస్తుంటే తాజాగా కోర్టు కేసులు నమోదవుతున్నాయి.

Read Also: Bomb At CM House: సీఎం ఇంటి దగ్గర బాంబు స్వాధీనం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆఫీస్ స్థలానికి అద్దె చెల్లించడంలో విఫలమైనందుకు తన కంపెనీపై దావా వేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి కోర్టు కేసు దాకా వెళ్లింది. హార్ట్‌ఫోర్డ్‌ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ డిసెంబర్‌ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్‌ తాఖీదులిచ్చింది.

Read Also: Villagers Attack : బీభత్సంగా కొట్టుకున్న రెండు వర్గాలు.. ఆపుదామకున్న పోలీసులకు గాయాలు

గడువులోగా చెల్లించకపోవడంతో గురువారం ట్విట్టర్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్‌ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ డిసెంబర్‌ 13వ తేదీనే కథనం ప్రచురించింది. రెండు చార్టర్‌ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్‌పై కేసు నమోదైంది.

Show comments