వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారాను ఎంపిక చేయలేదు. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై బీసీసీఐ వేటు వేసింది. 35 ఏళ్ల వయసున్న పుజారా కెరీర్‌కు ముగింపు పడినట్లే అని నెట్టింట వైరల్ అవుతుంది.
Read Also : Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
అయితే చటేశ్వర్ పుజారాను తప్పించడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా మిగతా బ్యాటర్లు ఏం చేశారు.. వారిని కూడా తప్పించాల్సింది పోయి కేవలం పుజారాను మాత్రమే తొలగించడం ఎంత వరకు సమంజసం అంటూ ఆయన అన్నారు. కొంతమంది అభిమానులు కూడా చటేశ్వర్ పుజారాకు మద్దతుగా నిలుస్తున్నారు. అతని ఆట ముగిసిపోలేదు.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.. మరో రెండేళ్లు అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉంది పూజారా అభిమాననులు చెప్పుకొస్తున్నారు.
Read Also : Varahi Navaratrulu: బ్రహ్మవిద్య జ్ఞానాన్ని ప్రసాదించే చాముండేశ్వరి ఆరాధన, స్తోత్ర పారాయణం
అయితే విండీస్ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై చటేశ్వర్ పుజారా పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ శనివారం సాయంత్రం ట్విటర్ వేదికగా ఒక వీడియోనూ షేర్ చేస్తూ బ్యాట్, బంతితో పాటు లవ్ ఎమోజీ పెట్టాడు. తన ఆట అయిపోలేదని.. మళ్లీ తిరిగి వస్తానంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఎమోషనల్ పోస్టు ద్వారా పూజారా చెప్పకనే చెప్పాడు. పుజారా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.