రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో నవంబర్ 3 (సోమవారం)న ఉదయం హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కంకర లోడ్ తో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సును ఢీకొట్టిన టిప్పర్ దాని పైనే బోల్తా పడడంతో కంకర ప్రయాణికులపై పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన లో ట్విస్ట్ చోటుచేసుకుంది. రోడ్డు మలుపు వల్ల ప్రమాదం జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు.
Also Read:Adenovirus: నిద్రలేచిన వైరస్ మృగం.. కరోనా కంటే డేంజర్.. ఇది సోకితే..!
రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించేందుకు టిప్పర్ డ్రైవర్ రైట్ కి వచ్చాడని తెలిపారు. వేగంగా రైట్ సైడ్ రావడంతో బస్సుని టిప్పర్ ఢీ కొట్టిందని వెల్లడించారు. టిప్పరు బస్సును ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఇద్దరు డ్రైవర్లు ఎవరు కూడా తాగి వాహనాలు నడపలేదని తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ పూర్తి చేశాం..చార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. టిప్పర్ యజమానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఓవర్ లోడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరును తాజాగా FIR లో చేర్చారు.
ప్రమాద సమయంలో ఓనర్ టిప్పర్ లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా ఓనర్ గాయాలతో బయటపడ్డాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని పోలీసులు తెలిపారు.
