NTV Telugu Site icon

Akluz : రింకీ, పింకీ మధ్యలో అతుల్.. ట్రిపుల్స్ అదుర్స్ అంటున్న నెటిజన్లు

Marridge3

Marridge3

Akluz: ముంబైకి చెందిన ఇద్దరు ఐటీ ఇంజనీర్ అమ్మాయిలు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్న అపూర్వ సంఘటన మల్షిరాస్ తాలూకాలోని అక్లూజ్‌లో చోటుచేసుకుంది. పింకీ, రింకీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు కందివలిలో ఐటీ కంపెనీలో ఐటీ ఇంజనీర్లుగా చేస్తున్నారు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. చనిపోయే వరకు కలిసి ఉండాలని భావించి ఒకే యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పింకీ, రింకీ ఇద్దరూ కవలలు కాబట్టి చూసేందుకు ఒకేలా కన్పిస్తారు. చిన్నప్పటి నుంచి ఒకరినే పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

Read Also: HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2

మల్షిరాస్ తాలూకాకు చెందిన అతుల్ అనే యువకుడికి ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం రింకీ పింకీ తండ్రి చనిపోవడంతో బాలికలు తల్లి వద్దే ఉంటున్నారు. ఒకసారి ఈ కుటుంబంలోని తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనారోగ్యం పాలైనప్పుడు అతుల్‌ వారిని కారులో ఆ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అతుల్, ఈ ఇద్దరు యువతుల మధ్య పరిచయం పెరిగింది. ఎట్టకేలకు నిన్న అతుల్ అదే మాండ్వాలో పింకీ, రింకీ ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. ఇరువైపులా నుంచి దాదాపు 300 మంది అతిథులు గల్లాండే హోటల్‌లో జరిగే వివాహానికి హాజరయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా చర్చ మొదలైంది.