Site icon NTV Telugu

IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Tg

Tg

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దాదాపు 20 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ అయ్యారు.

Read Also: Health Tips : పెదాలు నల్లబడటానికి ఇవే కారణాలు.. వాటిని పోగొట్టే మార్గం ఇదే!

అలాగే, జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్‌ కలెక్టర్ గా ప్రతిక్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదా దేవి, ములుగు కలెక్టర్ గా టీఎస్ దివాకరా, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version