Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVS Radeon 2026 Launched: టీవీఎస్ తన పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ‘రేడియాన్’ (TVS Radeon) 2026 ఎడిషన్‌ను పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త అప్డేటెడ్ వెర్షన్ ఆల్-ఎల్ఈడీ లైటింగ్, ఆకర్షణీయమైన కొత్త గ్రాఫిక్స్, సరికొత్త కలర్ ఆప్షన్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా వస్తోంది. పండుగ సమయంలో వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆ సేల్స్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఈ బైక్‌ను రంగంలోకి దింపింది. ఈ కొత్త టీవీఎస్ రేడియాన్ ధర రూ. 67,100 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమై, టాప్ మోడల్ కోసం రూ. 73,100 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఇది బేస్, డిజి-డ్రమ్, డిజి-డిస్క్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ ధర గత మోడల్ కంటే రూ. 1,250 పెరగగా, టాప్ ఎండ్ అయిన డిజి-డిస్క్ వేరియంట్ మాత్రం గతంతో పోలిస్తే చౌకగా లభిస్తోంది. అన్ని వేరియంట్ల ధరలను పరిశీలిస్తే, బేస్ వేరియంట్ ధర రూ. 67,100 కాగా, డిజి-డ్రమ్ ధర రూ. 70,100, టాప్-స్పెక్ డిజి-డిస్క్ ధర రూ. 73,100 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక, ఫీచర్లు, డిజైన్ పరంగా చూస్తే.. సరికొత్త టీవీఎస్ రేడియాన్‌లో ఎల్ఈడీ లైటింగ్ అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా లభిస్తుంది. సిగ్నేచర్ DRLతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను ఇందులో చేర్చారు. డిజి-డిస్క్ వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉండగా, మిగతా రెండు వేరియంట్లలో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు.
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
అలాగే బైక్ గ్రాఫిక్స్ కూడా అప్డేట్ చేశారు. బేస్ వేరియంట్ బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ కలర్లలో వస్తుంది. డిజి-డ్రమ్ వేరియంట్ బ్లాక్ విత్ ఆరెంజ్, రెడ్ విత్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక టాప్ వేరియంట్ అయిన డిజి-డిస్క్ బ్లాక్ విత్ ఆరెంజ్, రెడ్ విత్ బ్లాక్ డ్యూయల్-టోన్ (DT) కలర్లలో అందుబాటులో ఉంది. ఇక, బైక్ ఫీచర్లలో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 109.7 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8 హెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న ఈ బైక్ లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, రేడియాన్‌లో యూఎస్బీ ఛార్జింగ్ సదుపాయం, కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తాయి.
తాజావార్తలు
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
ట్రెండింగ్
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!