Site icon NTV Telugu

TVS Jupiter 125 DT SXC: స్టన్నింగ్ లుక్స్, స్మార్ట్ కనెక్టివిటీ పీసీలతో కేవలం రూ. 80,740కే టీవీఎస్ జుపిటర్ 125 DT SXC లాంచ్..!

Tvs Jupiter 125 Dt Sxc

Tvs Jupiter 125 Dt Sxc

TVS Jupiter 125 DT SXC: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్ స్కూటర్ జుపిటర్ 125 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన టీజర్లు సోషల్ మీడియాలో విడుదల కాగా, తాజాగా జుపిటర్ 125 DT SXC వేరియంట్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది కంపెనీ. ఈ జుపిటర్ 125 స్కూటర్ వేరియంట్ ధరను కంపెనీ ప్రారంభ ధరగా రూ. 80,740 (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.

Read Also: Illegal Affair : భర్త అన్నతో హనీమూన్‌.. ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య

ఈ కొత్త వేరియంట్‌లో సాధారణ మోడళ్లతో పోలిస్తే కొన్ని విజువల్ అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్ టోన్ రంగులలో ఇది లభించనుంది. అలాగే స్కూటర్‌లో డ్యూయల్ టోన్ ఇన్నర్ ప్యానల్స్, అదే షేడుతో ఉండే ఫ్లాట్ సింగిల్ పీస్ సీట్ కల్పించారు. ఇంకా 3D ఎంబ్లెమ్స్, బాడీ కలర్ గ్రాబ్ రైల్ వంటి డిజైన్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. ఈ వేరియంట్‌కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. ఇందులో TVS SmartXonnect కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. దీని ద్వారా వినియోగదారులు వాహన ట్రాకింగ్, వాయిస్ కమాండ్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SMS అలర్ట్స్, కాల్ అలర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లను వినియోగించుకోవచ్చు.

Read Also: Shrashti Verma: తెల్ల చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ..!

ఇతర వేరియంట్ల మాదిరిగానే ఈ DT SXC వేరియంట్‌కి కూడా అదే మెకానికల్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. స్కూటర్‌లో ముందుభాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో 3-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్సార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. స్కూటర్ 12-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. టీవీఎస్ జుపిటర్ 125 DT SXC వేరియంట్‌కి 124.8 cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉండి, ఇది 8hp శక్తి, 11 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. ఈ స్కూటర్ మార్కెట్లో హోండా ఆక్టివా 125, సుజుకి యాక్సెస్ 125 వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవనుంది.

Exit mobile version