NTV Telugu Site icon

TVS iQube EV Scooter: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ.20 వేల డిస్కౌంట్

Tvs Iqube Copy

Tvs Iqube Copy

TVS iQube Smart Electric Scooter: ఈ మధ్య కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఆటోమొబైల్ సంస్థలు వారి సేల్స్ పెంచుకోవడానికి వివిధ కొత్తరకాల ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుక వస్తున్నాయి. ఇకపోతే ఈవీ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంస్థ దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌తో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ ఆఫర్ వినియోగదారులకు అదిరిపోయే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపోతే, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ జనవరి 13 నుంచి 19 వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌ను కేవలం రూ.86,749కే కొనుగోలు చేయవచ్చు. మొత్తానికి ఈ స్కూటర్ అసలు ధర రూ.1,07,299 కాగా ప్రత్యేక ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

Also Read: Realme Buds Wireless 5 ANC: సరసమైన ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన రియల్‌మి నెక్‌బ్యాండ్‌

ఇక ఈ స్కూటీ పై ఉన్న డిస్కౌంట్ల విషయానికి వస్తే.. ఓన్లీ ఫర్ యూ డీల్ కింద రూ.5,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌పై మరో రూ.5,115 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా చూస్తే.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై EMI స్కీమ్ ద్వారా రూ.3,250 రీబేట్ లభిస్తుంది. ఇలా మరిన్ని డిస్కౌంట్స్ తో కలిపి స్కూటర్ ను కేవలం రూ.86,749కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌ అందించే పనితీరుతో రోజువారీ ప్రయాణాల్లో ఉపయోగపడే ప్రాథమిక ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తుంది. ఇక ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే..

Also Read: Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే

4 bhp పవర్, 33 Nm టార్క్ ఉత్పత్తి చేసే మోటార్‌, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల ప్రయాణం రేంజ్, 0-80% ఛార్జింగ్‌ 2.45 గంటల్లో పూర్తవుతుంది. ఇక గరిష్ఠంగా 75 kmph వేగంతో ప్రయాణం చేయవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌లో అధునాతన టెక్నాలజీతో పాటు పలు ఆకర్షణీయ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 5 అంగుళాల TFT స్క్రీన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, అండర్ సీట్ 30 లీటర్స్ స్టోరేజ్, టర్న్ బై టర్న్ నావిగేషన్, పార్క్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, 220 mm ఫ్రంట్ డిస్క్, 130 mm రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. వాల్నట్ బ్రౌన్, పెరల్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈవీ కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకుని టీవీఎస్ ఐక్యూబ్‌ ఇ-స్కూటర్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.