TVS iQube: బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 150 కి.మీ. రేంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. చాలాదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు పర్యావరణ అనుకూలత కారణంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో TVS iQube స్కూటర్ సేల్స్ పరంగా, మైలేజ్ పరంగా దూసుకెళ్తుంది.
ఇకపోతే,TVS iQube భారత మార్కెట్లో ప్రస్తుతం ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. iQube 2.2 kWh, iQube 3.4 kWh, iQube S 3.4 kWh, iQube ST 3.4 kWh, iQube ST 5.1 kWh లాంటి వేరియంట్స్ లో లభిస్తున్నాయి. ఇక వీటి ఎక్స్-షోరూమ్ ధరల విషయానికి వస్తే రూ. 95,000 నుండి ప్రారంభమవుతూ రూ.1,58,834 వరకు ఉన్నాయి. వేరియంట్స్ ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా మంచి వేరియంట్ ను ఎంచుకోనే అవకాశం ఉంది.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ఇందులోని TVS iQube 2.2 kWh వేరియంట్ ను ఒకసారి పూర్తిగా చార్జ్‌తో 75 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీనికి గరిష్ట వేగం 75 కి.మీ/గం. కేవలం రెండు గంటల్లో ఈ వేరియంట్ పూర్తిగా చార్జ్ అవుతుంది. 3.4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మొత్తం 100 కి.మీ. ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇక అతిపెద్ద 5.1 kWh బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జ్‌తో 150 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ఇక ఈ స్కూటర్ లోని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 5 అంగుళాల నుండి 7 అంగుళాల వరకు ఉన్న TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లే, వాయిస్ అసిస్టెంట్, నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఛార్జింగ్ పోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో 32 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, LED లైటింగ్, రివర్స్ అసిస్టెంట్ వంటి ప్రయోగాత్మక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇవి వినియోగదారులకు స్మార్ట్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇక అన్ని వేరియంట్లలో డిస్క్ బ్రేక్‌లు, రీజనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి. దీని ద్వారా ప్రయాణం అత్యధికంగా సురక్షితంగా ఉంటుంది. 4.4 kW మోటార్ మరియు బలమైన చాసిస్ దీన్ని తన సెగ్మెంట్‌లో వేగంగా, మృదువుగా నడిచే స్కూటర్‌గా నిలిపింది. స్టైల్, పనితీరు కలిపి తక్కువ బడ్జెట్‌లో ఉత్తమ ఎంపిక కావాలని కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. అంతేకాకుండా TVS iQube వాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణలో కూడా మీరు సహకరించవచ్చు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!