Site icon NTV Telugu

కొత్త ఫీచర్లు, ట్రెండీ డిజైన్స్‌తో TVS Apache RTR 160, 200 4V లిమిటెడ్ ఎడిషన్స్ వచ్చేసాయి!

Tvs Apache

Tvs Apache

TVS Apache RTR 160, 200 4V: TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ మోటార్‌సైకిల్ TVS Apache ని లాంచ్ చేసి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో.. దీనిని పునస్కరించుకొని ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్స్ ను లాంచ్ చేసింది. దీనితో Apache RTR 160, 180, 200, RR310, RTR310 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, TVS Apache RTR 160 తోపాటు RTR 200కి కొత్త టాప్ వేరియంట్ 4V మోడల్స్ ను కూడా విడుదల చేసింది.

CP CV Anand: ముందస్తు ఏర్పాట్లు, బందోబస్తు, డ్రోన్ల వినియోగం.. ప్రశాతంగా నిమర్జనం!

ఈ 4V వేరియంట్లు కొత్త డిజైన్, టెక్నాలజీ, పనితీరు ప్రాముఖ్యతలతో ముందు వరుసలో నిలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా Class-D ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ LED DRLs తో, పూర్తి LED లైటింగ్, 5-inch TFT కనెక్టెడ్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కొత్త బోల్డ్ కలర్లు, డైనమిక్ గ్రాఫిక్స్ ముఖ్యమైన ఆకర్షణలు. ఇక Apache RTR 160 4Vలో 159.7 cc, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఆయిల్ కూల్డ్, SOHC ఇంజిన్ ఉంది. ఇది 17.3 hp శక్తి, 14.73 Nm టార్క్‌ను అందజేస్తుంది. TVS ప్రకారం ఇది దేశంలోని ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన 160cc ఇంజిన్. వీటితోపాటు ఈ మోడల్‌లో ఉండే ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే.. మూడు రైడ్ మోడ్‌లు (Ride Modes), డ్యూయల్-చానల్ ABS, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ ను అందించారు. ఇవి రైడర్‌కు ఆధునిక సేఫ్టీ, కనెక్టివిటీ మరియు అద్భుతమైన పనితీరు అందజేస్తాయి.

Samyuktha Menon: ప్రపంచం విజయవాడ వైపు చూడాలనే ఈ ఉత్సవ్!

ఇక అదే Apache RTR 200 4Vలో 197.75 cc ఇంజిన్ ఉంది. ఇది 20.5 hp పవర్, 17.25 Nm టార్క్ ను జెనరేట్ చేస్తుంది. ఈ మోడల్‌లో కూడా Class-D ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ LED DRLs, పూర్తి LED లైటింగ్, 5-inch TFT కనెక్టెడ్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉండటం ప్రత్యేకంగ చెప్పుకోవచ్చు. మొత్తానికి, ఈ 20 ఏళ్ల ప్రత్యేక Apache ఎడిషన్ మోటార్‌సైకిళ్లు అద్భుతమైన డిజైన్, అధునాతన సాంకేతికత, సురక్షిత ప్రయాణాన్ని కలిగించేందుకు రెడీ అయ్యాయి.

Exit mobile version