కొత్త ఫీచర్లు, ట్రెండీ డిజైన్స్‌తో TVS Apache RTR 160, 200 4V లిమిటెడ్ ఎడిషన్స్ వచ్చేసాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVS Apache RTR 160, 200 4V: TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ మోటార్‌సైకిల్ TVS Apache ని లాంచ్ చేసి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో.. దీనిని పునస్కరించుకొని ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్స్ ను లాంచ్ చేసింది. దీనితో Apache RTR 160, 180, 200, RR310, RTR310 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, TVS Apache RTR 160 తోపాటు RTR 200కి కొత్త టాప్ వేరియంట్ 4V మోడల్స్ ను కూడా విడుదల చేసింది.
CP CV Anand: ముందస్తు ఏర్పాట్లు, బందోబస్తు, డ్రోన్ల వినియోగం.. ప్రశాతంగా నిమర్జనం!
Also Read
ఈ 4V వేరియంట్లు కొత్త డిజైన్, టెక్నాలజీ, పనితీరు ప్రాముఖ్యతలతో ముందు వరుసలో నిలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా Class-D ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ LED DRLs తో, పూర్తి LED లైటింగ్, 5-inch TFT కనెక్టెడ్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కొత్త బోల్డ్ కలర్లు, డైనమిక్ గ్రాఫిక్స్ ముఖ్యమైన ఆకర్షణలు. ఇక Apache RTR 160 4Vలో 159.7 cc, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఆయిల్ కూల్డ్, SOHC ఇంజిన్ ఉంది. ఇది 17.3 hp శక్తి, 14.73 Nm టార్క్‌ను అందజేస్తుంది. TVS ప్రకారం ఇది దేశంలోని ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన 160cc ఇంజిన్. వీటితోపాటు ఈ మోడల్‌లో ఉండే ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే.. మూడు రైడ్ మోడ్‌లు (Ride Modes), డ్యూయల్-చానల్ ABS, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ ను అందించారు. ఇవి రైడర్‌కు ఆధునిక సేఫ్టీ, కనెక్టివిటీ మరియు అద్భుతమైన పనితీరు అందజేస్తాయి.
Samyuktha Menon: ప్రపంచం విజయవాడ వైపు చూడాలనే ఈ ఉత్సవ్!
ఇక అదే Apache RTR 200 4Vలో 197.75 cc ఇంజిన్ ఉంది. ఇది 20.5 hp పవర్, 17.25 Nm టార్క్ ను జెనరేట్ చేస్తుంది. ఈ మోడల్‌లో కూడా Class-D ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ LED DRLs, పూర్తి LED లైటింగ్, 5-inch TFT కనెక్టెడ్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉండటం ప్రత్యేకంగ చెప్పుకోవచ్చు. మొత్తానికి, ఈ 20 ఏళ్ల ప్రత్యేక Apache ఎడిషన్ మోటార్‌సైకిళ్లు అద్భుతమైన డిజైన్, అధునాతన సాంకేతికత, సురక్షిత ప్రయాణాన్ని కలిగించేందుకు రెడీ అయ్యాయి.

తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?