TVK Chief Vijay: “టీవీకే మాస్టర్ ప్లాన్”.. విజయ్ పోటీ చేసేది అక్కడే.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Chief Vijay: రాబోవు తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్ర కళగం (TVK) పార్టీ కీలకంగా మారనుంది. ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ రాజకీయంలోని అడుగు పెట్టి టీవీకే పార్టీని స్థాపించారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అయితే.. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో పోటీకి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు టీవీకే చీఫ్ విజయ్.. నార్త్ చెన్నై నుంచి పోటీకి విజయ్ రెడీ అయ్యారు.. ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేస్తారన్న టీవీకే ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.. నార్త్ చెన్నై వెనుకబాటుకు డీఎంకేనే కారణమంటున్న విజయ్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తోంది.. నార్త్ చెన్నైని స్టాలిన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అక్కడి నుంచే తాము పోటీ చేయాలనుకుంటున్నట్లు పార్టీ నిర్ణయించుకుంది.
READ MORE: Indian Stock Market: 5 రోజుల్లో రూ.63 వేల కోట్లు సంపాదించారు.. ఎలాగో తెలుసా?
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఇదిలా ఉండగా.. ఇటీవల విజయ్ పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చాడు. అధికార డీఎంకేను కూల్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్ట చేశారు. అయితే.. రానున్న ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములైన ఎన్డీయే, యూపీయేతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, సంప్రదాయ పార్టీలైన రెండు వ్యతిరేక పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని స్పష్టంచేశారు. ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
READ MORE: T20 World Cup Semi-Final: ఫ్యాన్స్‌కు ఐసీసీ షాక్.. టీమిండియా సెమీఫైనల్ ముంబైలో జరగదా.?
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?