TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Vijay: తమిళనాడులో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చెన్నైలోని కోయంబేడు, కిలంబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూలు కట్టినట్లు విజయ్ పేర్కొన్నారు. రవాణా శాఖ వైఫల్యంపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు. పోలింగ్ సమయాన్ని మరో 2 గంటల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం రాజ్యాంగ హక్కు.. దానిని కాలరాయొద్దని హెచ్చరిక జారీ చేశారు. ఈసీ మూగప్రేక్షకుడిలా ఉండొద్దని విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్రలా ఉందని విజయ్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. తమిళనాడులో పోలింగ్ జాతర జోరుగా సాగుతోంది. ఓటింగ్ ప్రారంభం కాకముందే పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటలకు 17.69 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడంతో ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయమే ఓటర్లు తరలివచ్చారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. తమిళనాడులో మొత్తం 324 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ మధ్యలో సమయాన్ని పొడిగించాలని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరడం గమనార్హం.
Also Read
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, writes a letter to the Chief Election Commissioner to extend polling hours by two hours till 8:00 pm.
"Extend polling hours by two hours: In view of the large surge of delayed voters due to… pic.twitter.com/PFREoC4L3i
— ANI (@ANI) April 23, 2026
తాజావార్తలు
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!