TVK rally tragedy: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సంచలనంగా మారారు. గురువారం తమిళనాడు మధురైలో తమిళగ వెంట్రీ కజగం పార్టీ రెండవ వార్షికోత్సవ సభ విజయవంతం అయ్యింది. కానీ సభకు వచ్చిన వారిలో సుమారుగా 400 మంది విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 12 మంది పరిస్థితి విషయంగా ఉంది. పార్టీ రెండో మనాడును పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. సుమారుగా సభకు నాలుగు లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తే.. దానికి మించి ప్రజలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.
Read Also: Venky Comedian Ramachandra : మంచాన పడ్డ ‘వెంకీ’ సినిమా కమెడియన్ రామచంద్ర
12 మంది పరిస్థితి విషయం.. అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి
పార్టీ రెండో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మానాడులో నాలుగు లక్షలపైగా జనాలు పాల్గొనారని అంచనా. ఉదయం నుంచి ఎండ వేడి విపరీతంగా ఉండటం, ఉక్కపోత దీంతో పాటు తగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేని కారణంగా 400 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. స్పృహతప్పి పడిపోయిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు లేపలికి రాలేని పరిస్థితి ఉంది. దీంతో పార్టీ కార్యకర్తలే వారిని భుజాలపై మోసుకుంటూ స్థానిక ఆస్పత్రులకు తరలించారు. సభ ఏర్పాట్లలో బుధవారం ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.
Read Also: Russia Ukraine war: యుద్ధం ముగింపు ఉత్తుత్తి మాటలేనా?.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా