OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
- కాంగ్రెస్‌లో తుంగతుర్తి లొల్లిపై జగ్గారెడ్డి రిపోర్ట్..
- జగ్గారెడ్డి ఎవర్ని తప్పు పట్టారంటూ పార్టీ వర్గాల ఆరా..
- ఎమ్మెల్యే సామేల్ ఏఐసీసీ రూల్స్ పాటించలేదని రాశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుంగతుర్తి లొల్లి విషయమై కాంగ్రెస్ పెద్దలకు క్లారిటీ వచ్చిందా? పీసీసీ నియమించిన జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది? తన నివేదికలో ఎవర్ని తప్పు పట్టారు జగ్గన్న? అసలా పంచాయితీ సెట్ అయ్యే అవకాశం ఉందా? రిపోర్ట్ ప్రకారం చర్యలు ఉంటాయా? లెట్స్ వాచ్.
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఇక్కడ పార్టీలోని కీలక నాయకుల ఫోకస్ కూడా ఎక్కువే. ఎవరైనాసరే… కలుపుగోలుగా ఉండి కాస్త లౌక్యం ప్రదర్శించగలిగితే చాలు…దీనంత సేఫ్ నియోజకవర్గం ఎక్కడా ఉండదని పార్టీ నాయకులే చెప్పుకుంటారు. కానీ… అందుకు భిన్నంగా ఇటీవల ఇక్కడి వివాదాలు రచ్చకెక్కాయి. చివరికి కార్యకర్తలు రాళ్ళు రువ్వుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. తర్వాత అది ఇంకా ముదిరి కొత్త..పాత నాయకుల లొల్లిగా మారింది. దీంతో… ఇందులోని వాస్తవావాస్తవాలను తేల్చే బాధ్యతను సీనియర్ లీడర్ జగ్గారెడ్డికి అప్పగించింది పీసీసీ. తాజాగా తుంగతుర్తి పంచాయితీపై రిపోర్ట్ ఇచ్చారాయన. ఈలోపే… ఎమ్మెల్యేలు సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా జరిగిపోయింది. ఆ సంగతి ఎలా ఉన్నా… జగ్గారెడ్డి నివేదికలో ఏముంది..? ఆయన ఎవరిని తప్పు పట్టారంటూ ఆరా తీస్తున్నాయి పార్టీ వర్గాలు.
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
మాజీ ఎమ్మెల్యే తన నివేదికలో కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మండల కమిటీల నియామకంలో ఏఐసీసీ నిబంధనలను సామేల్ పాటించలేదని, పూర్తిగా ఉల్లంఘన జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 9 మండలాలు ఉంటే… అందులో అర్వపల్లి, మద్దిరాల, తిరుమలగిరి మండలాల్లో పంచాయితీలు ఎక్కువ. అర్వపల్లి మండల అధ్యక్షుడి నియామకంలో రూల్స్ పాటించలేదని నివేదికలో వివరించినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చిన వ్యక్తికి మండల అధ్యక్ష పదవి కట్టబెట్టారని జగ్గారెడ్డి స్పష్టం చేశారట. MLA అధ్యక్ష పదవి ఇచ్చిన వ్యక్తి సూర్యాపేటలో రెబల్‌గా పోటీ చేశారని నివేదికలో వివరించారట. తిరుమలగిరి టౌన్ లీడర్ కి.. రూరల్ మండలం బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే మండలంలో సీనియర్ నేత… మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సొంత ఊరు ఉంది. ఉత్తమ్ ప్రతిపాదించిన నాయకుడి పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదని నివేదికలో ఉందంటున్నారు.
ఇక మద్దిరాల మండలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువ. అలాగే ఎంపీ చామల ఇక్కడ స్థానికుడు. ఆయన ఓ నాయకుడి పేరు ప్రతిపాదించారు. ఎంపీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసి ఒకే పేరు ప్రతిపాదించినా…ఎమ్మెల్యే సామేల్ పూర్తిగా పక్కకు పెట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కూడా తుంగతుర్తి నియోజక వర్గం వాసి. ఆయన ప్రతిపాదనల్ని కూడా పక్కన పెట్టేశారట MLA. ఆ రకంగా ఈ మూడు మండలాలకు సంబంధించే ప్రధానంగా లొల్లి పెరిగినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే మూడు చోట్ల పదవుల మార్పు ఉండవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే హక్కుల్ని కూడా తన నివేదికలో ప్రస్తావించారట జగ్గారెడ్డి. అంతవరకు బాగానే ఉన్నా…. జగ్గారెడ్డి ఇచ్చిన నివేదికను పీసీసీ ఎప్పుడు అమలు చేస్తుంది? ఒకవేళ చేయకుంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా ఇక్కడ కీలకమేనని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
తాజావార్తలు
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!