మణుగూరులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి మంచి పనులను ప్రజలకు జరిగిన మేలు చెప్పుకోవడానికే ఈ సమ్మేళనమన్నారు. తొమ్మిది సంవత్సరాల తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన మార్పులు ఏంటో తెలుసుకోవాలని, తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నప్పుడే పినపాక ప్రాంతంలో అర్ధరాత్రి కాలినడకతో పర్యటించిన సందర్భాలు ఉన్నాయన్నారు. గిరిజన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ శాసనసభ్యుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ భావన పెట్టుకోకుండా పరిమితులు లోబడి పని చేశామన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారని, అవకాశాన్ని పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సద్వినియోగం చేసుకున్నాని ఆయన తెలిపారు.
Also Read : Unni Mukundan : ప్రధాని మోడీతో మలయాళ నటుడు భేటీ.. నా అకౌంట్‌లో ఇదే పవర్ ఫుల్ పోస్ట్
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఫస్ట్ టైంలో అన్ని రంగాలు కలిపి రూ.40 వేల కోట్లు మంజూరు చేశారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించకపోయిన తెలంగాణలో భాగమే మీ జిల్లా అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. పది నియోజకవర్గాల్లో ఆరోజు నా శక్తిమేర అభివృద్ధి చేశానని, పినపాకలో కాంతారావు పట్టుబట్టి ఏ రకంగా పనులు చేస్తున్నాడో అదే విధంగా జిల్లా మొత్తం అభివృద్ధి చేశానని ఆయన వివరించారు.
Also Read : Heroines In Naked: దానికోసం బట్టలు విప్పడానికైనా రెడీ అంటున్న హీరోయిన్లు
కరెంటు లోటు లేకుండా చేస్తున్నామని, గతంలో మంత్రులు వస్తే సబ్ స్టేషన్‌ల వద్ద ధర్నాలు జరిగేవని, ఈ తొమ్మిది సంవత్సరాలలో ఆ పరిస్థితులు లేవన్నారు. బ్రిటీష్ కాలం నాటి నీటి ప్రయాణం ఎలా జరిగేదో గోదారిపై బ్యారేజ్ నిర్మాణం నిర్మించి నిండు గోదావరిపై అదేవిధంగా నీటి ప్రయాణాలు కొనసాగిస్తామన్నారు. రేగా కాంతరావు లాంటి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.