ఖమ్మం జిల్లా ఎస్ఆర్ కన్వెన్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నాకు రాజకీయ జన్మ ఇచ్చిన పూజ్యులు ఎన్టీఆర్ అని, రాష్ట్ర విభజనతో ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో అవమానాలు ఎదురైనా తెలుగుదేశంలోనే ఉన్నానన్నారు. మార్చి 29న దేవుడు ఎన్టీఆర్ పెట్టిన ముహూర్తం ఆ దేవుడు కూడా మార్చలేడని, గోదావరి జలాల తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయాలనేది నా ఆశయమన్నారు. చిన్న వయస్సులో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని, నా రాజకీయ లక్ష్యం పూజ్యులు ఎన్టీఆర్ బాటలో రైతాంగం కోసం పనిచేయడమన్నారు తుమ్మల.
Also Read : Payal Rajput: అలా చేస్తే ‘అజయ్ భూపతి’ని చంపేస్తా : పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ కామెంట్స్
అంతేకాకుండా.. ‘నాకు పదవులు అవసరం లేదు. జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరిలో ఉన్నా. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ నన్ను అక్కున చేర్చుకుంది. ఖమ్మం గెలుపు తెలంగాణ గెలుపు. నేను కష్టపడ్డ పార్టీ నన్ను ఓడించిందంటే ఆ పార్టీలో ఉండకూడదు అని వచ్చా. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఖమ్మం లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మలుపు. తెలుగుదేశం పార్టీ నాకు మద్దతు గా నిలిచిందంటే ముప్పై ఏళ్ల కష్టం కు గౌరవం దక్కింది. ఖమ్మం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు ఇవి. రాష్ట్రం అంతా వదిలి ఖమ్మం పాలేరు లో ఓడించాలని బి.ఆర్.ఎస్ ప్రయత్నం చేస్తుంది. అది మీ తరం కాదు. ఈ ఎన్నికలు…అహంకారానికి ఆత్మ గౌరవం కు మద్య జరుగుతున్న ఎన్నికలు. సన్నాసుల్లా బతికే జాతి కాదు తల ఎత్తుకుని బతికే జాతి మనది. నా గెలుపు కోసం మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్యవాదాలు.’ అని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
Also Read : CM KCR : కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదు