NTV Telugu Site icon

Tummala Nageswara Rao : గతంలో ఆగిపోయిన అన్ని పధకాలు పునరుద్ధరణ చేశాం

Tummala

Tummala

Tummala Nageswara Rao : ఖమ్మం సత్తుపల్లి వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో 21 వేల కోట్ల రుణామాఫీ, 7,625 వేల కోట్ల రైతు బంధు, 3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో ఆగిపోయిన అన్ని పధకాలు పునరుద్ధరణ చేశామని ఆయన వ్యాఖ్యానించారు. సన్నా ధాన్యానికి బోనస్ ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని పంటలకు MSP ధరకే కొనుగోలు చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రైతాంగ ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు.

Boy Kidnap : ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్‌.. అమ్మేసి.. సొమ్ము చేసుకున్న వైనం

అంతేకాకుండా..’పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే స్థూలంగా ప్రభుత్వం యొక్క ఆలోచన. రైతు భరోసా మీద ఎలాంటి నిబంధనలు కానీ పంట వేయ్యనటువంటి రైతులను తగ్గించటం కోసం చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం ఇంత వరకు యే విధమైన ఆలోచన చేయ్యలేదు. కేబినేట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశాం. ఎలాంటి చర్చలు చేసిన మా ఆలోచన ఒక్కటే..పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ద్వారా ప్రభుత్వ పరంగా వేసులుబాటు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసా పై ఎలాంటి నిర్ణయం చేయ్యనటువంటి ప్రభుత్వం పై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయ్యోద్దు. మేము చేసిన చర్చల ఫలితాలను క్యాబినేట్ లో పెడతాం.
కేబినేట్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం. పంట వేసిన ప్రతి రైతుకు ఎలాంటి కోతలు లేకుండా పంట సహాయం ఇవ్వాలనేదే వ్యవసాయ శాఖ మంత్రిగా నా వ్యక్తిగత అభిప్రాయం.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

October 2024 Movie Roundup: ఆసుపత్రి పాలైన రజినీకాంత్, గోవింద.. కార్తికేయ -2కి జాతీయ అవార్డు

Show comments