NTV Telugu Site icon

Tummala Nageswara Rao : మీరు ఎంతపోరాటం చేసినా గుట్టలు ఆగడంలేదు, ప్లాట్లు ఆగడం లేదు..

Tummala Nagewsher Rao

Tummala Nagewsher Rao

కులాల పేరా, మతాల పేరా ప్రజల మధ్య చిచ్చు పెట్టె పార్టీ లను బొంద పెట్టాలని రాహుఎల్ గాంధీ జోడోయాత్ర చేశారన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాలుగున్నర ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారని, మీరు ఎంతపోరాటం చేసినా గుట్టలు ఆగడంలేదు,ప్లాట్ లు ఆగడం లేదన్నారు. మీ ఆస్తులు ఆగడం లేదు…. మూఠాగా ఏర్పడి దోచుకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు. నిన్న మల్సూర్ అనే కార్యకర్త కూతురు ఎంగేజ్ మెంట్ లో ఓ 20 మంది పువ్వాడ మనుషులు ఆయన ఇంటిమీద పడి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. సీపీ నుంచి డీజీపీ వరకు ఫోన్లు చేసి చెప్పానన్నారు.

Also Read : BJP News: పోలీసును కారులో నుంచి లాగి కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్

అంతేకాకుండా.. ‘కొందరు పోలీసు అధికారులు పని గట్టుకొని మా కార్యకర్తలను వేధిస్తున్నారు… కంట్రోల్ చేయండి లేదా 30 రోజుల్లో ప్రజలు మీ మీద ప్రతిఘటన చేస్తారు అని చెప్పాను…. ఒక్కరో ఇద్దరో చిల్లర పనులు చేస్తే మేము చర్యలు తీసుకుంటాం అని ఉన్నత అధికారులు అన్నారు…. బలిసి,మదం పట్టి ప్రవర్తిస్తున్నారు…. మీరు నా చేతుల మీద బి ఫారం తీసుకున్న వారే…. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి…లేదా మిమ్మల్ని తన్ని తరిమి రోజులొస్తాయి…. చిల్లర ప్రవర్తన మానకపోతే పోరాటం చేస్తామ్…. సైదులు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు కాబట్టి అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదు… నేను అధికారంలోకి వస్తే ముందు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లేక్ నిధులు తర్వాతేఎవరికైనా…. ఖమ్మం జిల్లా ఎప్పటికి కాంగ్రెస్ జిల్లానే…. ప్రజల హక్కులను కాపాడే భాధ్యత నాది…. జావేద్ ఓ పులి మాదిరిగా ఎదురొడ్డి పార్టీని కాపాడారు…. ప్రజలు గెలిచే ఎన్నిక ఇది…’ అని తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.

Also Read : Stock Market Crash: మార్కెట్‌లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు రూ.18లక్షల కోట్ల నష్టం