Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన పడవద్దు
- వ్యవసాయాధికారులతో మంత్రి తుమ్మల టెలికాన్ఫరెన్స్
- రాష్ట్రంలో యూరియా కొరత లేదు
- రైతులు ఆందోళన పడవద్దు : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి 2.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వము నుండి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిఉండగా, రాష్ట్రానికి 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరిస్తున్నా, రాష్ట్రానికి కేటాయించిన దానిలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మార్క్ ఫెడ్ వద్ద ఉంచిన 3.08 లక్షల మెట్రిక్ టన్నులతో అవసరం మేరకు అన్ని జిల్లాలకు సరఫరా చేస్తూ ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికే మా అధికారులు కేంద్ర అధికారులను కలవడం జరిగిందని, తాను ప్రత్యక్షంగా సంబంధిత మంత్రివర్యులకు లేఖల ద్వారా మా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేయాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు.
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
SLBC : ఎస్ఎల్బీసీ ఘటన.. రంగంలోకి నేవీ ప్రత్యేక బృందం
రాష్ట్రానికి సంబంధించిన బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో విమర్శలు మాని మన రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తమ వంతు కృషి చేస్తే బాగుంటుందని, పెరిగిన విస్తీర్ణం , వినియోగం దృష్ట్యా రైతుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని తమ వంతు బాధ్యత తీస్కొని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్ధతు అందిస్తే మంచిదని హితవు పలికారు.. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి కేటాయించిన యూరియా వెంటనే సరఫరా చెయ్యాలని కోరడం జరిగిందన్నారు.
గత యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణంతో పోల్చుకుంటే, ఈ సారి నీటి వనరులు, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటం తో ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల విస్తీర్ణంలో 5 నుండి 10 శాతం వరకు వృద్ధి నమోదైనట్టు, యూరియా వాడకం కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పటికే 1.9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా వినియోగించినట్టు మంత్రిగారు తెలిపారు.
ఐనప్పటికి రాష్ట్ర ప్రభుత్వము పంటకాలం ప్రారంభం నుండే నిత్యం సమీక్షించుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకున్నామని, వెస్సెల్స్ కానీ, రైల్వే wagons కానీ రావడంలో ఎక్కడైనా, ఏదైనా జిల్లాకు ఆలస్యమైతే వెంటనే పొరుగుజిల్లాల నుండి తరలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.29 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఫిబ్రవరి 22న 3 rakes, 23న 7 , 24న 4 , 25న 7 , 26న 4 , 27న 5 rakes, 28న 4 rakes మొత్తం 81,800 మెట్రిక్ టన్నులు ఈ వారంలో సరఫరా అవుతుందని తెలియజేశారు. అధికారులు యూరియా సరఫరా విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, కృత్రిమంగా ఎవరైనా కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను మంత్రిగారు ఆదేశించడం జరిగింది.
IND vs PAK: ఓడీఐలో అత్యధిక క్యాచ్‌లు.. సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ ‘కోహ్లీ’
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!