ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చెమటోడ్చితే మూడు రంగుల జెండా అధికారులకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మాట్లాడుతూ.. అధికారాన్ని సుస్థిరం కోసం భారతదేశ మొత్తం భారత్ జోడయాత్ర రాహుల్ చేపట్టడం జరిగిందని, అందర్నీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతుతో బీఆర్ఎస్, మత బీజేపీని ఓడించామన్నారు. జరగబోయే ఎన్నికల్లో వారి మద్దతు డిప్యూటీ సీఎం మల్లు భట్టి కోరడం జరిగిందని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల తుళ్లూరు బ్రహ్మయ్య, అయోధ్య పాయం వెంకటేశ్వర్లు ,సమిష్టిగా పని చేసి పార్టీని గెలిపించుకోవాలన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల కు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘సీతమ్మ సాగరపై మరికొంత సాయం చేయాలని సీఎంని కోరాను.. గోదారి తీర ప్రాంతంలో పామాయిల్ సాగుకు కృషిచేసి పరిశ్రమనీ ఏర్పాటు చేస్తా. స్వాతంత్రం దినోత్సవం రోజునే రెండు లక్షల రూపాయల రుణం అకౌంట్ లో వేసేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తుంది. రైతులు అండగా భీమా కోసం 400 కోట్లును వెచ్చించబోతోంది. ఈ వారంలో అందరికీ రైతు బంధు అందబోతోంది. భద్రాద్రి రాముడు సాక్షిగా పేదవాళ్ళ కోసం ఇంద్రమ్మ ఇంటి పథకం ప్రారంభించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం జారీ చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలో అన్ని అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. సీఎంకు కొండంత అండ ఇవ్వాలంటే జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకోవాలి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.’ అని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.