NTV Telugu Site icon

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల

Ttd

Ttd

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. ఇప్పటికే పలు సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌ విక్రయించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది.. ఈ రోజు ఆన్‌లైన్‌లో జనవరి నెల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లతో పాటు పలు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కాబోతున్నాయి.. ఇక, మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు..

Read Also: Rakesh Varre : నవంబర్ 8 న విడుదల కానున్న ‘జితేందర్ రెడ్డి’

మరోవైపు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది.. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, నిన్న 64,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలకు పేర్కొంది టీటీడీ.