NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు తిరుమలలో ఆగస్టు నెల టికెట్లు విడుదల..

Ttd

Ttd

Arjitha Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడు ఆగస్టు నెల టికెట్లు రిలీజ్ చేయనున్నారు. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చెయ్యనుంది. నేటి ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చెయ్యనుంది.

Read Also: MS Dhoni Retirement: ఆ తర్వాతే ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌!

కాగా, తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు సైతం నేటి నుంచి షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖల పై వీఐపీ బ్రేక్ దర్శనాల జారీని టీటీడీ పాలక మండలి పున: ప్రారంభించింది. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేదీ నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.. అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ లో ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో మళ్లీ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తున్నారు. సిఫార్సు లేఖల స్వీకరణపై టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా ఎన్నికల సంఘం స్పందించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Read Also: HIV-positive: హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా 200 మందితో సంబంధం పెట్టుకున్న మహిళ..

అయితే, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 85, 825 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 36, 146 మంది భక్తులు.. హుండి ఆదాయం 4.4 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా, ఎల్లుండి పౌర్ణమి గరుడ వాహన సేవ ఉండనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తలకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.