Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్‌సైట్ పేరులో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని కనిపించేది.. కానీ, దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్‌లో భాగంగా బుకింగ్ వెబ్‌సైట్‌నూ మార్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికారిక వెబ్‌సైట్‌ను మార్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని టీటీడీ అధికారులు సూచించారు.
Read Also: Central Election Commission in AP: ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. నేడు, రేపు పర్యటన
ఇక, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16న పార్వేట, గోదాపరిణయోత్సవాల కారణంగా స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. సంక్రాంతి పండగని పురస్కరించుకొని తిరుపతి గోవింద రాజస్వామి వారి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదాకల్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.