NTV Telugu Site icon

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఆర్జిత సేవా టికెట్లు విడుదల!

Ttd

Ttd

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్‌ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం ఆగష్టు 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లతో పాటు నవంబర్‌ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లను, ఈనెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేయనున్నారు.

Also Read: Sourav Ganguly: ఇది దారుణం.. సౌరవ్ గంగూలీపై బెంగాలీ నటి ఆగ్రహం!

ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, దివ్యాంగుల టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల.. తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. తిరుమల-తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్నారు.

Show comments