NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ

Tirumala

Tirumala

Tirumala: పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కనులారా దర్శించుకొసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం.. టీటీడీ అనేక రకాల చర్యలు చేపడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాట్లు చేస్తుంది. ఇక వేసవికాలకంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం.. గంటల కొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది.

తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం 2024 మార్చి నెల‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న ద‌ర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– డిసెంబ‌రు 18వ తేదీ ఉద‌యం 10 నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు.

– డిసెంబ‌రు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

– డిసెంబ‌రు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి తెప్పోత్సవాల టికెట్లను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

– డిసెంబ‌రు 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శన టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

– డిసెంబ‌రు 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్రద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

– డిసెంబ‌రు 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్రస్టు దాత‌ల ద‌ర్శనం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

– డిసెంబ‌రు 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శన‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

– డిసెంబ‌రు 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన ట‌కెట్లను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

– డిసెంబ‌రు 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

– డిసెంబ‌రు 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులను కోరింది.