శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక దర్శనం, వసతి గదులను తమ అఫీషియల్ వెబ్ సైట్.. https://tirupatibalaji.ap.gov .inలో బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. అయితే.. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సువర్ణవకాశమనే చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు మూడు టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. అందులో ముఖ్యమైనవి అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ నేటి ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు అలర్ట్ గా ఉండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.
Also Read : Health Tips : 50 ఏళ్ల వయసులో యవ్వనంగా ఉండాలంటే.. ఇలా చెయ్యాల్సిందే..
అలాగే ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటా తో పాటు.. ఇవాళ పాటు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు టీటీడీ అధికారులు. ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్లు పొంద లేకపోయిన వారు.. శ్రీవాణి ట్రస్టు ద్వారా బుక్ చేసుకోవాలని.. శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. అందుకే వీటికి డిమాండ్ బాగానే ఉంటోంది. ఇక వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ మూడు సేవల టికెట్లు ఇవాళే అందుబాటులోకి వస్తున్నాయి.
Also Read : Harry Brook Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. బ్రూక్ క్యాచ్ పట్టినా మరొకరి ఖాతాలో క్రెడిట్!
