TTD: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఇకపై అదనపు లడ్డూలు కావాలంటే?
- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్
- లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు
- ఇకపై ఆధార్ ఉంటేనే అదనపు లడ్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు కోరినన్ని లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలను జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి నూతన విధానం అమలులోకి చెచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే తిరుమల శ్రీవారి లడ్డూలు ఇస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
Read Also: రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలనం.. తెలుగువారికి మినహాయించి వారందరికి పాదాభివందనం
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితమని.. ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డే ఇస్తామని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు ఒక్కసారి లడ్డూ తీసుకుంటే నెల రోజుల పాటు లడ్డూ పొందే అవకాశం లేదని కౌంటర్ సిబ్బంది అంటున్నట్లు సమాచారం. టీటీడీ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారం దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు అందజేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డుపై 2 లడ్డూలు మాత్రమే అందజేస్తామన్నారు. దళారి వ్యవస్థను అరికట్టడానికే టీటీడీ నూతన నిర్ణయం తీసుకుందన్నారు. లడ్డూలను దళారులు ఢిల్లీ,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్ళి విక్రయించే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!