NTV Telugu Site icon

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఇకపై అదనపు లడ్డూలు కావాలంటే?

Tirumala Laddu

Tirumala Laddu

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు కోరినన్ని లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలను జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి నూతన విధానం అమలులోకి చెచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆధార్‌ కార్డు ఉంటేనే తిరుమల శ్రీవారి లడ్డూలు ఇస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Read Also: రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలనం.. తెలుగువారికి మినహాయించి వారందరికి పాదాభివందనం

స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితమని.. ఆధార్‌ కార్డు చూపిస్తే మరో లడ్డే ఇస్తామని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు ఒక్కసారి లడ్డూ తీసుకుంటే నెల రోజుల పాటు లడ్డూ పొందే అవకాశం లేదని కౌంటర్‌ సిబ్బంది అంటున్నట్లు సమాచారం. టీటీడీ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారం దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు అందజేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డుపై 2 లడ్డూలు మాత్రమే అందజేస్తామన్నారు. దళారి వ్యవస్థను అరికట్టడానికే టీటీడీ నూతన నిర్ణయం తీసుకుందన్నారు. లడ్డూలను దళారులు ఢిల్లీ,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్ళి విక్రయించే అవకాశం ఉందన్నారు.