Site icon NTV Telugu

TTD : పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన… సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Padmavati Ammavaru

Padmavati Ammavaru

TTD : రేపటి నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాల‌ను పుర‌స్కరించుకుని నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ప‌ద్మావ‌తి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి స‌హ‌స్రనామార్చన నిర్వహించి, ఆ త‌రువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి, అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆతర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అయితే.. ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా నిన్నటి నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Duddilla Sridhar Babu : కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది

ఈ నేపథ్యంలోనే.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు ఆలయంలో లక్ష కుంకుమార్చన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్ద గల కౌంటర్‌లో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు. అయితే.. ఈ నేపథ్యంలోనే… నేడు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.ఈ రోజు సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. అయితే.. బ్రహ్మోత్సవాలకు ఎన్నడూ లేని విధంగా తిరుమలలో ఏర్పాట్లు చేశారు.

Pawan Kalyan: నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..

Exit mobile version