NTV Telugu Site icon

TTD: భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ.. టీటీడీ కీలక నిర్ణయాలు

Ttd

Ttd

TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ర్ట రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. స్విమ్స్ హస్పిటల్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు అందించే సేవలపై, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్‌ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also: Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదు..

తిరుమలలో వున్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేస్తామని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని.. అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తిరుమల పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించామన్నారు. భక్తులు సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ వద్ద 3.6 కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల బంగారు కలశం ఏర్పాటు చేశామని చెప్పారు. శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చెయ్యడానికి నోటీసులు జారీ చేశామని.. వారి సమాధానంపై తదుపరి చర్యలు ఉంటాయని టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు.

 

Show comments