Site icon NTV Telugu

TTD Govina APP : శ్రీవారి భక్తులకు త్వరలో అందుబాటులోకి గోవింద యాప్‌

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు సంఖ్య రోజు రోజకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందంచేందుకు టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోవింద యాప్‌ను భక్తులకు కోసం ప్రవేశపెట్టిన కొన్ని సాంకేతిక కారణాలు దాట్లో తలెత్తాయి. అయితే.. భక్తులకు సౌలభ్యం కోసం మరింతగా యాప్‌ను డెవలప్‌చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది టీటీడీ. ఈ యాప్‌ ద్వారా.. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేయడంతో సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా రూపొందించే పనిలో ఉంది ఐటీ విభాగం.
Also Read : Shraddha Walker Case: అఫ్తాబ్‌ పూనావాలా జ్యూడీషియల్‌ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు

దర్శన టోకెన్లకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టీటీడీకి సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు భక్తులు. కొత్తగా తీసుకొచ్చే యాప్‌ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు అంటున్నారు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు టీటీడీ అధికారులు. ఇదిలా ఉంటే.. శ్రీవారి జనవరి నెల కోటా అర్జిత సేవలు ఈనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు.

Exit mobile version